నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్‌,బీజేపీ, కాంగ్రెస్‌
x
Highlights

ఇప్పుడు అందరి దృష్టి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై కేంద్రీకృతమయ్యింది. ఏ పార్టీలో చూసినా నాగార్జునసాగర్ ఉపఎన్నికపైనే. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో...

ఇప్పుడు అందరి దృష్టి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై కేంద్రీకృతమయ్యింది. ఏ పార్టీలో చూసినా నాగార్జునసాగర్ ఉపఎన్నికపైనే. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. దీంతో సిట్టింగ్‌ స్థానం కోసం టీఆర్ఎస్‌ ఓడిన చోట గెలవాలని జానారెడ్డి కుటుంబం దుబ్బాకను తమ ఖాతాలో వేసుకున్న కమలం మరోసారి నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో సత్తాచాటి పాగావేయాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏమిటీ..? ఆయా పార్టీల బలాలు, బలహీనతలపై హెచ్‌ఎంటీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణంతో నాగార్జునసాగర్‌కు ఉప‌ ఎన్నిక అనివార్యమయ్యింది. నోముల మరణంతో జరగబోయే ఉప‌ ఎన్నికను అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఛాలెంజ్‌గా తీసుకుని అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. 2018 సాధారణ ఎన్నికల‌ తర్వాత హుజూర్‌నగర్ కాంగ్రెస్ ‌సిట్టింగ్ సీటును‌ టీఆర్ఎస్ దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్‌ను‌ బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఇక ఇపుడు నాగార్జునసాగర్ ‌సిట్టింగ్ సీటును ‌గెలవాలని టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

నోముల నర్సింహయ్య ‌బీసీ యాదవ సామాజికవర్గం‌ కావడంతో పాటు నాగార్జునసాగర్‌లో యాదవుల ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనికి నోముల మరణంతో ఆయన‌ కుటుంబానికి టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని లేదంటే ఆ‌ కుటుంబానికి కాకుండా తేరా చిన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి‌, ఎంసీ కోటి‌రెడ్డీలకు టికెట్ అవకాశం వచ్చే వీలుంది. తన తండ్రి నాగార్జునసాగర్‌ను ఎంతో అభివృద్ధి చేశారని నియోజకవర్గ ప్రజలు‌ నోముల నర్సింహయ్య ఆశయ సాధనలో వెన్నంటి ఉన్నారని‌ నోముల భగత్ అంటున్నారు. తమ‌ కుటుంబంతో పాటు ఎవరికి అవకాశం ఇచ్చినా టీఆర్ఎస్ గెలుస్తుందంటున్నారు నోముల నర్సింహయ్య కుమారుడు ‌నోముల భగత్‌.

ఇక నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి‌ పోటీ చేయడం సవాల్‌గా మారింది. రికార్డు మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్న జానారెడ్డి గత ఎన్నికలో నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. నోముల మరణంతో జానారెడ్డి‌ పోటీ చేయడమా లేక తన‌ కొడుకు రఘువీర్‌రెడ్డిని ఫోటీ చేయించడమా అనే చర్చ నడుస్తుంది. జానారెడ్డి అంటేనే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ అంటేనే జానారెడ్డి అన్నట్లు ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా జానారెడ్డి‌ని చూసే క్యాడర్ ఉంటుంది. కానీ గత ముప్పై నలభై ఏళ్లుగా జానారెడ్డి వెంట నడిచిన వాళ్లు టీఆర్ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బీజేపీ నుంచి ముగ్గురు నేతలు ప్రధానంగా ఫోటీ పడుతూ టికెట్ కోసం రాష్ట్ర కేంద్ర స్థాయి లో లాబీయింగ్ చేస్తున్నారట. గత ఎన్నికలో నాగార్జునసాగర్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడినా కంకణాల నివేదిత రెడ్డి, కడారి అంజయ్య యాదవ్‌తో పాటు ఎన్ఆర్ఐ రిక్కల ఇంద్ర సేనారెడ్డి ఉన్నారు. అయితే బీజేపీలో నివేదిత రెడ్డి, అంజయ్య యాదవ్‌ల కన్నా తాను మెరుగని అవకాశం వస్తే కచ్చితంగా గెలుస్తానని అవకాశం రాకున్నా బీజేపీ గెలుకోసం ప్రయత్నం చేస్తానంటున్నారు రిక్కల ఇంద్రసేనా రెడ్డి.

కాంగ్రెస్ ఇక్కడ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ ఎన్నిక కోసం ఏకంగా టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఎంపిక అగేలా ఉందంటే కాంగ్రెస్ ఎంత చాలెంజ్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో గెలిచి వచ్చే ఎన్నికల‌ నాటికి మారుమూల నియోజకవర్గాలలో పాగా వేయొచ్చనే ఫ్లాన్ తో ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఇప్పుడు నాగార్జునసాగర్‌లో గెలుపు అన్నట్లు ‌వ్యవహరిస్తుంది. ఇక టీఆర్ఎస్‌ ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories