Sagar Bypoll: సాగర్‌ ఉపఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు పూర్తి

Sagar Bypoll: నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Arun Chilukuri
Published on: 30 March 2021 3:20 PM IST
Nagarjun Sagar By-Election: TRS, BJP and Congress Candidates File Nominations
X

Sagar Bypoll: సాగర్‌ ఉపఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు పూర్తి

Sagar Bypoll: నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేష‌న్లకు ఇవాళే చివ‌రి గ‌డువు కావ‌డంతో ప‌లు పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేష‌న్ వేసేందుకు త‌ర‌లివ‌చ్చారు. అభిమానులతో వెళ్లిన నోముల భగత్ నిడ‌మ‌నూరు రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాల‌యంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మంత్రులు మ‌హ‌ముద్ అలీ, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌లతో పాటు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు నోముల భగత్.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి రవినాయక్‌ కూడా తమ నామినేషన్‌ సమర్పించారు. అయితే కొవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నామినేషన్ వేశారు అభ్యర్థులు. మరో గంటలో నామినేషన్ల పర్వం ముగుస్తుండటంతో ఇక ఎన్నికల ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు సాగర్‌లో మకాం వేయగా నేటి నుంచి నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story