Nagarkurnool: డిఎన్ఏ అనగానే ప్లేట్ తిప్పేసిన విద్యార్థిని: ప్రియుడు కాదు.. గర్భానికి కారణం ఆ బంధువే!

Nagarkurnool: డిఎన్ఏ అనగానే ప్లేట్ తిప్పేసిన విద్యార్థిని: ప్రియుడు కాదు.. గర్భానికి కారణం ఆ బంధువే!
x

Nagarkurnool: డిఎన్ఏ అనగానే ప్లేట్ తిప్పేసిన విద్యార్థిని: ప్రియుడు కాదు.. గర్భానికి కారణం ఆ బంధువే!

Highlights

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన కేజీబీవీ (KGBV) ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసు అనూహ్య మలుపు తిరిగింది.

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన కేజీబీవీ (KGBV) ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసు అనూహ్య మలుపు తిరిగింది. తన గర్భానికి కారణం తోటి విద్యార్థేనని చెప్పి అతడిని ఇరికించబోయిన బాలిక, పోలీసుల చాకచక్యం ముందు లొంగిపోయింది. డీఎన్ఏ (DNA) పరీక్ష నిర్వహిస్తామన్న హెచ్చరికతో భయపడి అసలు నేరస్థుడి పేరును బయటపెట్టింది.

తోటి విద్యార్థిపై నెట్టేసే ప్రయత్నం

నగరంలోని ఓ స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన 16 ఏళ్ల విద్యార్థినిని పోలీసులు విచారించగా, తనకు టెన్త్ క్లాస్ సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే గర్భం దాల్చినట్లు తొలుత ఫిర్యాదు చేసింది. ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తనకు బాలికతో పరిచయం, చాటింగ్ ఉన్న మాట వాస్తవమే కానీ, శారీరక సంబంధం లేదని మొత్తుకున్నాడు.

డీఎన్ఏ పరీక్షతో వీడిన గుట్టు

బాలుడి సమాధానంతో అనుమానం వచ్చిన పోలీసులు, సైంటిఫిక్ దర్యాప్తుకు సిద్ధమయ్యారు. "నిజం చెప్పకపోతే శిశువుకు, బాలుడికి డీఎన్ఏ పరీక్ష చేయిస్తాం.. అప్పుడు నువ్వు దొరికిపోతావు" అని బాలికను గట్టిగా హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన ఆ విద్యార్థిని, తన ఇంటి పక్కనే ఉండే వివాహితుడైన బంధువు వల్లే తాను గర్భవతినయ్యానని అసలు విషయాన్ని అంగీకరించింది.

నిందితుడిపై పోక్సో కేసు

బాలిక ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే సదరు వివాహితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో అన్యాయంగా ఇరుక్కోబోయిన విద్యార్థి ఊపిరి పీల్చుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories