Nagam Janardhan Reddy: ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే తెలంగాణ సర్కార్‌ ఏం చేస్తుంది?

Nagam Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 1:46 PM IST
Nagam Fumes at Telangana Govt. Over Silence in AP Projects
X

నాగం జనార్ధన్‌రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Nagam Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి. గతంలో ఏపీ సీఎం పోతిరెడ్డిపాడు విస్తరణ చేస్తామని అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బేసిన్లు లేవు, భేషజాలు లేవు... ఏపీ వాళ్లు కూడా బతకాలని తెలిపారన్నారు. ఇప్పుడేమో అవి అక్రమ ప్రాజెక్టులని.. వాటిని ప్రజలు అడ్డుకోవాలని అంటున్నారన్నారు కాంగ్రెస్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఏపీలో కడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story