ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది.. ఎవరీ సుమన్.. నాగశౌర్యతో లింకేంటి?

Naga Shaurya’s Farm House Raid Latest Updates
x

ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది.. ఎవరీ సుమన్.. నాగశౌర్యతో లింకేంటి?

Highlights

Naga Shaurya: యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది.

Naga Shaurya: యువ హీరో నాగశౌర్య ఫామ్‌హౌజ్‌పై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరికొందరిని ఎస్‌ఓటీ పోలీసులు విచారిస్తున్నారు. గుత్తా సుమన్‌కు నాగశౌర్య మధ్య సంబంధాలపై ఆరా తీస్తున్నారు. గుత్తా సుమన్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు తెరపైకి నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు వినిపిస్తుంది. ఇక నిన్న నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతున్న 20 మంది ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో వీరిని రిమాండ్‌కు తరలించనున్నారు.

పేకాట కేసులో పట్టుబడ్డ సుమన్ చౌదరి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమన్ చౌదరి ఏపీలో ఓ ఎన్జీవో పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఏపీలో పలు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు నార్సింగి పోలీసులు. సుమన్ చౌదరిపై విజయవాడ లో భూకబ్జా కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు విజయవాడ పోలీసులు సైతం గుత్తా సుమన్‌ ఆగడాలపై ఆరా తీస్తున్నారు.

నటుడు నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో దొరికిన గుత్తా సుమన్‌ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని గుత్తా సుమన్‌ పేకాట ఆడిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల క్యాసినో ఆడిపిస్తున్నట్టు సమాచారం సేకరించారు. అసలు ఎవరీ గుత్తా సుమన్‌ అని చూస్తే సెటిల్‌మెంట్లు, బెదిరింపుల్లో ఆరితేరిన వ్యక్తి గుత్తా సుమన్‌. పలుచోట్ల భూ వ్యవహారాల్లో మోసాలకు పాల్పడ్డాడు సుమన్. తాండూరులో 55 ఎకరాలు మోసం చేసిన బాధితుల్లో ఓ డాక్టర్‌, పోలీస్‌ అధికారి కూడా ఉన్నారు. అలాగే గుంటూరులోనూ గుత్తా సుమన్‌పై పలు కేసులు ఉన్నాయి. అమెరికాలో ఉన్న పలువురు ఎన్నారైలను సుమన్‌ మోసం చేశారు.

ఓ కన్‌స్ట్రక్షన్ బిల్డర్‌గా సుమన్ వ్యవహరిస్తున్నాడు. ఏపీలో ఆగతవరపాడులో ఫేక్ డాక్యుమెంట్లతో పొలాన్ని ప్లాట్ గా మార్చి అమ్మినట్లు గుర్తించారు. ఇక 2017 లో పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ ఒకరు, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ లతో కుమ్మక్కై 1.42 ఎకరాల భూకబ్జాకు పాల్పడ్డాడు. దీనిపై పెదకాకానీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఆకేసులో సుమాన్‌ అరెస్ట్ కూడా అయ్యారు. బడా రాజకీయ నేతలతో ఫొటోలు దిగి.. తనకు పరిచయాలు ఉన్నాయని.. ఉద్యోగాల పేరిట మోసాలకు కూడా పాల్పడ్డాడు సుమన్. మరోవైపు అతని ఫోన్‌లో బడా నేతల నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories