Shamshabad: కళ్లల్లో కారం చల్లి.. చీరకొంగుతో ఉరేసి.. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి..

Hyderabad: సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది.

Arun Chilukuri
Published on: 12 Aug 2023 4:57 PM IST
Mystery Reveals in Shamshabad Woman Murder
X

Shamshabad: కళ్లల్లో కారం చల్లి.. చీరకొంగుతో ఉరేసి.. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టి..

Hyderabad: సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మంజులను హత్యచేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజులను హత్యచేసిన రిజ్వానా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. మంజుల కళ్లల్లోకి కారం చల్లి, చీరతో గొంతు బిగించి హత్య చేశారని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. మంజుల దగ్గర రిజ్వానా లక్ష రూపాయలు తీసుకుందని..డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతోనే హత్య చేసిందన్నారు. అర్ధరాత్రి మంజుల మృతదేహాన్ని రిజ్వానా తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిందని...హత్యలో రిజ్వానాకు ఎవరూ సహకరించలేదని శంషాబాద్ డీసీపీ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story