Love Marriage: మయన్మార్‌ అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి..

Myanmar Girl and Adilabad Guy Gets Married
x

Love Marriage: మయన్మార్‌ అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి..

Highlights

Love Marriage: ప్రేమకు దేశాలు, ఖండాంతరాలు ఉండవు అంటారు.

Love Marriage: ప్రేమకు దేశాలు, ఖండాంతరాలు ఉండవు అంటారు. సరిగ్గా అలాగే ఆదిలాబాద్ అబ్బాయి మయన్మార్‌ అమ్మాయి ఒకట్టయ్యారు. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్ష్యంలోనే వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం ప్రారంభించారు. మయన్మార్‌ యువతి జిన్‌నెహు థియేన్‌(క్యాథరిన్‌) ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం చింతగూడకు చెందిన రవికుమార్‌ ఖతర్‌ దేశంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని రవికుమార్‌ తమ తల్లిదండ్రులకు తెలపడంతో వారు పెళ్లికి ఒప్పుకొన్నారు. 20 రోజుల కిందట ఇద్దరూ గ్రామానికి రాగా.. చర్చిలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి తరఫున ఆమె సోదరుడు క్యాహు క్యాహు థియేన్ హాజరుకాగా.. వరుడి తరపున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.




Show Full Article
Print Article
Next Story
More Stories