Secunderabad: కుమ్మరిగూడలో ఉద్రిక్తత, ఆందోళనకారుల అరెస్ట్..

Idol Vandalised : సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2024 1:49 PM IST
Secunderabad: కుమ్మరిగూడలో ఉద్రిక్తత, ఆందోళనకారుల అరెస్ట్..
X

Muthyalamma Temple Idol Vandalised : సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు. . సంఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తదితరులు పరిశీలించారు.

విషయం తెలుసుకున్న వెంటనే హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా అక్కడికి చేరుకుని సంఘటనస్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి ఆలయంలో విగ్రహాం ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. అమ్మవారి ఆలయంలో విగ్రహాం ధ్వంసం వెనుక కుట్రను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story