Danam Nagender: గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను కోల్డ్ స్టోరేజ్ లో పడేసింది

Danam Nagender: గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను కోల్డ్ స్టోరేజ్ లో పడేసింది
x

Danam Nagender: గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను కోల్డ్ స్టోరేజ్ లో పడేసింది

Highlights

Danam Nagender: హైదరాబాద్‌ నగరానికి మణిహారమైన మూసీ నది ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు.

Danam Nagender: హైదరాబాద్‌ నగరానికి మణిహారమైన మూసీ నది ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూనే, ప్రస్తుత ప్రణాళికలను ఆయన వివరించారు.

మూసీ ప్రక్షాళన కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తొలి అడుగులు పడ్డాయని, అయితే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 'కోల్డ్ స్టోరేజ్'లో పడేసి నిర్లక్ష్యం చేసిందని దానం ఆరోపించారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, ఇందులో భాగంగానే మంత్రుల బృందం దక్షిణ కొరియాలో పర్యటించి అక్కడి నదుల పునరుద్ధరణపై అధ్యయనం చేసిందని గుర్తు చేశారు.

ఈ ప్రాజెక్టుపై అంతర్జాతీయ స్థాయిలో నమ్మకం ఉందని, సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. మూసీ కలుషిత నీటితో పండించిన పంటల వల్ల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక ఆర్థికంగా నష్టపోతున్నారని, ఈ దుస్థితి మారాలంటే ప్రక్షాళన అనివార్యమని పేర్కొన్నారు.

దానం నాగేందర్ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన పనులకు సంబంధించి ఒక 'టైమ్ లైన్' (గడువు) నిర్ణయించి, దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ప్రజలకు ప్రాజెక్టు పురోగతిపై స్పష్టత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత వ్యాఖ్యల పట్ల దానం ఆవేదన వ్యక్తం చేశారు. AI (కృత్రిమ మేధ) మరియు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను మిస్ గైడ్ చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories