
అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ముర్ము.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Droupadi Murmu: సా. 6 గంటలకు హకీంపేట నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రాష్ట్రపతి
Droupadi Murmu: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు హకీంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెల్లనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం చేరుకొని అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హకీంపేట నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




