ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం

Jeevan Reddy: నిందితుడిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు

Jyothi
Updated on: 2 Aug 2022 12:29 PM IST
Murder Attempt On Armoor MLA Jeevan Reddy At His House Banjarahills
X

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం

Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని వేమూరీ ఎన్‌క్లేవ్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యేపై ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా సర్పంచ్ భర్త తిరిగడాన్ని ఎమ్మెల్యే సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. ఇక సర్పంచ్ భర్తను బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story