Asifabad: పోలీసు స్టేషన్‌ నుంచి నిందితుడు పరార్‌

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ నిందితుడు పరార్‌ అయ్యాడు.

Arun Chilukuri
Published on: 7 Nov 2025 12:10 PM IST
Asifabad: పోలీసు స్టేషన్‌ నుంచి నిందితుడు పరార్‌
X

Asifabad: పోలీసు స్టేషన్‌ నుంచి నిందితుడు పరార్‌

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ నిందితుడు పరార్‌ అయ్యాడు. తిర్యాణి మండలం పిట్టగూడలో వృద్ధుడు మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్‌ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్‌ కార్యాలయానికి తరలించారు. నిందితుడు వినోద్‌ బహిర్బూమికి వెళుతానని చెప్పడంతో కానిస్టేబుళ్లు బాత్‌రూంకు తీసుకెళ్లారు.

అక్కడికి చేరుకున్నాక వినోద్‌ వెంట వచ్చిన పోలీసులను తోసివేసి బేడీలతోనే పారిపోయాడు. నిందితుడు తిర్యాణి మండలంలో తిరుగుతున్నట్లు సమాచారం రాగా పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తాజాగా నిందితుడి వలన ప్రాణహాని ఉందంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story