మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy: రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా

Jyothi
Published on: 30 July 2022 1:13 PM IST
Munugodu MLA Komatireddy Rajagopal Reddy Key Comments
X

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. తాజాగా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై ధర్మ యుద్దం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు భావిస్తే ఉప ఎన్నిక ఖాయమని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో మార్పుకు నాంది అవుతుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు.

మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. రాబోయే 10, 15 రోజుల్లో మునుగోడులో చర్చించి యుద్ధం ప్రకటిస్తానని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story