మునుగోడులో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్.. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

Munugode Polling: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది.

Arun Chilukuri
Updated on: 3 Nov 2022 7:15 PM IST
Polling Ends in Munugodu
X

మునుగోడులో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్.. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

Polling Ends in Munugodu: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5గంటల వరకు 77.55శాతం పోలింగ్ శాతం నమోదైంది. 3గంటల నుంచి 5గంటల వరకు దాదాపు 18 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటికీ పలు పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలైన్‌లు ఉన్నాయి. మునుగోడులో 3గంటల తర్వాత పోలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఈసారి భారీగా యువత, మహిళలు ఓటేశారు. ఉదయం గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ నమోదైంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story