కూసుకుంట్ల.. డ్యాన్స్ షో.. అప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉంది తెలంగాణ

Kusukuntla: కార్యకర్తలతో డ్యాన్స్ చేసి సందడి చేసిన మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల

Jyothi
Published on: 9 Nov 2023 7:18 PM IST
Munugodu BRS Kusukuntla Prabhakar Reddy Dance
X

కూసుకుంట్ల.. డ్యాన్స్ షో.. అప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉంది తెలంగాణ

Kusukuntla: అప్పుడు ఎట్ల ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్ల ఉంది తెలంగాణ. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రచార స్లోగన్‌గా మారిపోయింది. పార్టీ అభ్యర్థులంతా ఇదే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకొందరు అయితే కాస్త వినూత్నంగా తమ నియోజకవర్గానికి అన్వయించుకుంటూ.. ప్రచారం చేస్తున్నారు. మునుగోడు brs అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. పార్టీ కార్యకర్తలతో సందడి చేశారు. అప్పుడు ఎట్ల ఉండే మునుగోడు ఇప్పుడు ఎట్ల ఉంది మునుగోడు అంటూ జోర్ధార్‌గా డబ్బు చప్పుళ్లకు స్లోగన్ చెప్పారు.

అనంతరం బ్యాండ్ సౌండ్‌కు కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ కూడా వేశారు. నామినేషన్ సందర్భంగా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ దేవాలయంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పూజలు చేశారు. నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు.

Jyothi

Jyothi

Next Story