రేపు మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్

*ఉ. 11 గంటలకు నామినేషన్ వేయనున్న కూసుకుంట్ల

Rama Rao
Published on: 12 Oct 2022 6:35 PM IST
Munugode TRS Candidate Kusukuntla Prabhakar Reddy Nomination Tomorrow
X

రేపు మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ 

Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. వీరితో పాటు సీపీఎం , సీపీఐ నేతలకు టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 6న ఫలితాలు రానున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story