Harish Rao: జూటా ఔర్ జుమ్లాకు బీజేపీ నిదర్శనం

Harish Rao: మునుగోడులో చెప్పేటివన్నీ జూటా ఔర్ జుమ్లా

Jyothi
Published on: 16 Oct 2022 1:43 PM IST
Munugode ByPoll Telangana Minister Harish Rao Criticized BJP
X

Harish Rao: జూటా ఔర్ జుమ్లాకు బీజేపీ నిదర్శనం

Harish Rao: అమలుగానీ హామీలు ఆర్భాటపు ప్రకటనలతో బీజేపీ పాలన సాగిస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను , ఎన్నికల తర్వాత పట్టించుకోదనేందుకు బీజేపీ ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ జూటా ఔర్ జుమ్లా విధానాన్ని అవలంబిస్తోందని ఎద్దేవా చేశారు.

ఉద్యమాల గడ్డ నల్గొండజిల్లా ప్రజలను మోసగించేందుకు బీజేపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలనుకున్న సాగు చట్టాలపై పోరాటం చేసిన రైతులను పొట్టనబెట్టకున్న చరిత్ర బీజేపీదన్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగితే ఉగ్రవాదులు, దేశద్రోహులని హింసించి, దేశవ్యాప్తంగా 750 మందిరైతుల్ని పొట్టన బెట్టుకుందెవరని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలను మోసగించాలనుకోవడం మూర్ఖత్వమేన్నారు. మోడీ క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధాని ఇచ్చిన హామీ సంవత్సరం గడిచినా, అమలు కాలేదన్నారు.

Jyothi

Jyothi

Next Story