Munugode Bypoll: ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

*మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,855 మంది

Rama Rao
Updated on: 3 Nov 2022 7:12 AM IST
Munugode Bypoll Polling Updates | TS News
X

ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ 

Munugode Bypoll: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెర పడింది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అన్నిపోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రారంభానికి ముందు మాక్‌పోలింగ్ నిర్వహించారు. మునుగోడు నియోజవకర్గంలో మొత్తం 2లక్షల 41 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు ఉపఎన్నిక బరిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, తెలంగాణ జనసమితి నిలిచాయి. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా 298 పోలిగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. అలాగే.. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ బందోబస్తులో 2వేల 500 మంది పోలీసులు పాల్గొన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story