మునుగోడులో కారు జోరు.. 5వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.. తెలంగాణ భవన్‌లో సంబరాలు..

Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 6 Nov 2022 3:46 PM IST
Munugode By Election Results 11th Round of Counting Ends
X

మునుగోడులో కారు జోరు.. 5వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్.. తెలంగాణ భవన్‌లో సంబరాలు..

Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో కారు జోరు కొనసాగుతోంది. 11వ రౌండ్ కౌంటింగ్ లోనూ టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 11 రౌండ్లు ముగిసే సమయానికి అధికార టీఆర్ఎస్‌ 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం దాదాపు ఖరారవడంతో.. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన 11వ రౌండ్ల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబరుస్తోంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుతున్నారు. జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story