టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమైన మున్నూరు రవి.. సీఐతో సెల్ఫీ.. హత్యాయత్నం కేసులో...

Munnur Ravi: ఆసక్తిగా మారిన సీఐతో మున్నూరు రవి ఫోటో...

Shireesha
Updated on: 28 April 2022 6:01 PM IST
Munnuru Ravi Selfie with Basheer Bagh CI in TRS Plenary 2022 | Live News Today
X

టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమైన మున్నూరు రవి.. సీఐతో సెల్ఫీ.. హత్యాయత్నం కేసులో...

Munnur Ravi: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. నిన్న జరిగిన పార్టీ ప్లీనరీకి మహబూబ్‌నగర్‌కి చెందిన మున్నూరు రవి హాజరయ్యాడు. ప్లీనరీకి హాజరవడమే కాదు కొందరు నేతలతో కలిసి ఆయన ఫోటోలు కూడా దిగారు. పేట్ బషీర్ బాగ్ పీఎస్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.

అయితే అదే పోలీస్ స్టేషన్ సీఐతో మున్నూరు రవి సెల్ఫీ దిగాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ఇలా ప్లీనరీలో ప్రత్యక్షమవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Shireesha

Shireesha

Next Story