Municipal elections 2020: మంత్రులకు మున్సిపోల్స్‌ ముచ్చెమటలా.. గులాబీ బాస్‌ ఆదేశాలే టెన్షన్‌కు కారణమా?

Municipal elections 2020: మంత్రులకు మున్సిపోల్స్‌ ముచ్చెమటలా.. గులాబీ బాస్‌ ఆదేశాలే టెన్షన్‌కు కారణమా?
x
Highlights

అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మించినట్టుగా ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరిగి ఓట్లడుగుతున్నారు. వీరిలో...

అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మించినట్టుగా ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరిగి ఓట్లడుగుతున్నారు. వీరిలో అంతో ఇంతో టెన్షనైతే వుంది. కానీ ప్రభుత్వంలో కీలకమైన కొందరిలో మాత్రం, అంతకుమించిన టెన్షన్‌. క్షణంక్షణం వారి బీపీ పెరుగుతోంది. ఇంతకీ ఎవరు వారు? ఎందుకంత హైరానపడిపోతున్నారు?

తెలంగాణ మంత్రులకు మున్సిపల్‌ ఎన్నికలు టెన్షన్‌ పుట్టిస్తున్నారు. క్షణం తీరికలేకుండా వాడవాడలా తిరుగుతున్నా, గులాబీ బాస్‌ నిర్దేశించిన టార్గెట్‌పై లోలోపల హైరాన పడుతున్నారు. ఫలితం అటూఇటైనా కేబినెట్‌ బెర్తుకే ఎసరు తప్పదని పరేషాన్ అవుతున్నారు. అందుకే తమకు అప్పగించిన మున్సిపాల్టీల్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వెళ్లిన ఇంటికే రెండుమూడుసార్లు వెళ్తూ, అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. అయినా గులాబీ బాస్ గుబులు కంటి మీద కనుకు లేకుండా చేస్తోందట.

మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్‌, ప్రతిక్షణం మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏమాత్రం తేడా కనిపించినా తాఖీదులిస్తున్నారట. కానీ కొందరు మంత్రులు మాత్రం దారి తప్పుతున్నారని, లుకలుకలతో మొత్తానికి మోసం వచ్చేలా వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్నారట కేటీఆర్. దీంతో అటు కేసీఆర్, ఇటు కేటీఆర్‌ డేగ కన్ను వేయడంతో, నిద్రలోనూ కలవరపాటుకు గురవుతున్నారట మినిస్టర్లు.

దీంతో జిల్లా మంత్రులందరూ ఆయా జిల్లాలోని మున్సిపాల్టీల ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ప్రచారహోరు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మంత్రులు సైతం గ్రేటర్ శివారులో కొత్తగా ఏర్పాటయిన మున్సిపాల్టీల్లో తొలిసారిగా జరిగే ఎన్నికల్లో, గులాబీ జెండా ఎలాగైనా ఎగురవెయ్యాలని పట్టుదలగా వున్నారట. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు గ్రేటర్‌ శివారులో క్యాంపెయినింగ్ హోరెత్తిస్తున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాలు బిజెపి కైవసం చేసుకోవడంతో మున్సిపాల్టీల్లో, ఇదే హవా కంటిన్యూ చెయ్యాలని కమలం తపిస్తోంది. కాషాయానికి ఎలాగైనా కౌంటర్‌ వెయ్యాలని గులాబీ బాస్‌ వ్యూహాలు రచిస్తున్నారు. నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని పట్టుదలగా ఉన్నారట. దీంతో నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఇప్పుడు వీరికి మున్సిప‌ల్ ఎన్నిక‌లే ప్రధాన టార్గెట్. వారు అన్ని పనులు పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలయ్యే వరకు మరో పని ముట్టుకోవడం లేదట.

మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని జిల్లా మంత్రలు జిల్లాలోనే ఉంటున్నారు. వారు హైదరాబాద్ రాక నెల గడుస్తోంది. హైదరాబాద్ మంత్రులు కూడా శివారు మున్సిపాల్టీల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎంత తిరిగినా, గడప గడపకూ ఐదారుసార్లు చక్కర్లుకొట్టినా, ఫలితాలు అటూ ఇటూ అయితే, తమ మంత్రి పదవి ఏమవుతుందోనని టెన్షన్‌ పడుతున్నారట మంత్రులు. మరి మినిస్టర్లకు పరీక్షగా మారిన మున్సిపోల్స్‌లో, టీఆర్ఎస్‌ ఫలితాలు ఎలా వుంటాయో, నిజంగా ఆ ఎఫెక్ట్‌ వారి ఫ్యూచర్‌పై ఎలా పడుతుందోనని, టీఆర్‌ఎస్‌లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories