కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని మున్సిపల్ సిబ్బందికి నోటీసులు..

Municipal Commissioner: మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తీరు వివాదానికి దారి తీసింది.

Arun Chilukuri
Updated on: 27 July 2022 9:00 PM IST
Municipal Commissioner Issues Show Cause Notice To Staff For Not Attending KTR Birthday Celebrations
X

కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని మున్సిపల్ సిబ్బందికి నోటీసులు..

Municipal Commissioner: మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తీరు వివాదానికి దారి తీసింది. కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రానందుకు నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు తలెత్తాయి. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మున్సిపల్ అధికారులు వాట్సప్ ‌లో ఇచ్చిన మెసేజ్ ఇన్విటేషన్‌కి హాజరు కాలేదంటూ నోటీసులిచ్చారు. ఇందుకుగాను సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టం మేనేజర్ మోహన్, బిల్ కలెక్టర్ శ్రావణ్‌లకు సోకాజ్ నోటీసులు అందుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story