Telangana: నేడు నల్గొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

Telangana: నల్గొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపల్‌ పాలకవర్గ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఈరోజే ఎన్నుకోనున్నారు.

Arun Chilukuri
Published on: 7 May 2021 11:10 AM IST
Municipal Chairman in Nakrekal Today
X

Telangana: నేడు నల్గొండ జిల్లానకిరేకల్‌ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

Telangana: నల్గొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపల్‌ పాలకవర్గ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఈరోజే ఎన్నుకోనున్నారు. ఎన్నికల పరిశీలకురాలిగా ఐఏఎస్‌ అధికారిణి వాకాటి కరుణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఎన్నిక ఏర్పాట్లను పూర్తిచేశారు. నకిరేకల్‌ ఎంపీడీవో కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. సభ్యులు చేతులెత్తే పద్ధతి ద్వారానే ఎన్నుకుంటారు. అయితే టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా మేజిక్ ఫిగర్‌ 11 మంది సభ్యులను గెలిపించుకుంది. అయితే ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టీఆర్ఎస్‌ నుంచి ఇద్దరికి గాలం వేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అది జరిగినా ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లతో చైర్మన్‌ పదవీని టీఆర్ఎస్సే దక్కించుకునే చాన్స్ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story