Rajanna Sircilla: మున్సిపల్ అధికారులు నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిండ్రు అయ్యా.. మంత్రి కేటీఆర్ కు మొర పెట్టుకున్న వృద్ధురాలు..

Rajanna Sircilla: మున్సిపల్ అధికారులు తనని తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మంత్రి కేటీఆర్ కు ఓ వృద్ధురాలు మొరపెట్టుకుంది.

Arun Chilukuri
Updated on: 8 Aug 2023 9:15 PM IST
Municipal Authorities Kicked me out of the House Old Woman Says to Minister KTR
X

Rajanna Sircilla: మున్సిపల్ అధికారులు నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిండ్రు అయ్యా.. మంత్రి కేటీఆర్ కు మొర పెట్టుకున్న వృద్ధురాలు..

Rajanna Sircilla: మున్సిపల్ అధికారులు తనని తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మంత్రి కేటీఆర్ కు ఓ వృద్ధురాలు మొరపెట్టుకుంది. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పట్టణానికి చెందిన బుర్ర రాజేశ్వరి అనే వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌ను కలిసింది. పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో తన ఇల్లు నీట మునిగిందని...తాత్కాలికంగా తనకు మున్సిపల్ అధికారులు పునరావాసం కల్పించారని వృద్ధురాలు మంత్రికి తెలిపింది.

వర్షాలు తగ్గిన నేపథ్యంలో రాజేశ్వరి తన ఇంట్లోకి తాను వెళ్తానంటే మున్సిపల్ అధికారులు వెళ్లనివ్వడం లేదని మంత్రి కేటీఆర్‌కు మొరపెట్టుకుంది. ఇంటి తాళాలు ఇవ్వమని మున్సిపల్ కార్యాలయం చుట్టూ, మున్సిపల్ కౌన్సిలర్, చైర్ పర్సన్ చుట్టూ తిరిగిన తన గోడు పట్టించుకోవడం లేదని వాపోయింది. బయట వేరే వాళ్ల ఇళ్లల్లో కిరాయికి ఉంటే 5 వేలు కిరాయి అడుగుతున్నారని, నాకు వచ్చే పింఛన్ డబ్బు కిరాయిలకు కూడా సరిపోవని మంత్రి కేటీఆర్ దయతలిచి తన ఇంటి తాళాలు ఇప్పించాలని వృద్ధురాలు వేడుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story