Mulugu: ములుగు జిల్లా వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి

Mulugu: ములుగు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్​తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 11:38 AM IST
Mulugu: ములుగు జిల్లా వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
X

Mulugu: ములుగు జిల్లా వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి 

Mulugu: ములుగు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్​తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఎలాంటి లైసెన్స్ తీసుకోకున్నా చూసీచూడనట్లు వ్యవహరించిన అప్పటి అధికారులు మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యాక నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి షాపుకి ట్రేడ్​ లైసెన్స్ ఉండేలా ఇప్పటికే షాపుల వివరాలను సేకరించిన సిబ్బంది లైసెన్స్ రేట్లను హైక్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 నుంచే ఈ రేట్లు అమలులోకి వస్తాయని కలెక్టర్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

ములుగులో వ్యాపారం చేస్తున్న ప్రతీ ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్. ట్రేడ్ లైసెన్స్ లేనట్లయితే చట్టరీత్యా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ట్రేడ్​ లైసెన్స్​లేని వారిని గుర్తించి నోటీసులు అందజేస్తామని తెలిపారు. కొత్త నిబంధనలు త్వరలోనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story