పంచాంగ కర్త ములుగు అస్తమయంతో విషాద ఛాయలు

కడసారి నివాళి అర్పించేందుకు నివాసానికి చేరుకుంటున్న ప్రముఖులు

Rama Rao
Updated on: 24 Jan 2022 11:22 AM IST
Mulugu Ramalingeswara Vara Prasad The Final Journey Start in Malakpet
X

పంచాంగ కర్త ములుగు అస్తమయంతో విషాద ఛాయలు

Mulugu Ramalingeswara: ప్రముఖ పంచాగ కర్త, శ్రీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ మరణంపై తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పామరుల వరకూ జ్యోతిష్యం చెప్పడంలో ఆయన దిట్ట.. రాశుల స్థితిగతులు, గ్రహాల సంచారంపై ఆయన అద్భుతమైన విశ్లేషణ చెప్పేవారు.. ఎందరో రాజకీయనేతల భవిష్యత్తును కూడా ముందుగానే ఊహించి చెప్పిన ఘనుడు ములుగు సిద్ధాంతి.. ములుగు మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. మరికాసేపట్లో దోమల గూడ లోని ఆయన నివాసం నుంచి మలక్ పేటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కడసారి నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story