సిద్దిపేట జిల్లా తొగుట ఎమ్మార్వో చేతివాటం

తుక్కాపూర్‌కు చెందిన ముగ్గురు రైతుల నుంచి లంచం డిమాండ్

Rama Rao
Updated on: 16 July 2022 12:54 PM IST
MRO Bribe Demand In Siddipet | TS News
X

సిద్దిపేట జిల్లా తొగుట ఎమ్మార్వో చేతివాటం

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట ఎమ్మార్వో చేతివాటం బట్టబయలైంది. తూక్కపూర్‌కు చెందిన ముగ్గురు రైతుల నుంచి లంచం డిమాండ్ చేశారు ఎమ్మార్వో కృష్ణమోహన్. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఒక్కొక్క రైతు నుంచి 3వేలు నుంచి 5వేల వరకు లంచం అడిగారు. అయితే అంత ఇచ్చుకోలేమని రైతులు చెప్పినప్పటికీ.. ఎమ్మార్వో వినలేదు. మూడ్రోజుల పాటు తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు.

తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్క రిజిస్ట్రేషన్‌కు 15వందలు ఇస్తామని రైతులు ముందుకొచ్చారు. వారి నుంచి దర్జాగా లంచం తీసుకుంటూ ఖుషీగా డబ్బులిచ్చి పోవాలని ఉచిత సలహా ఇచ్చాడు ఎమ్మార్వో. అయితే.. రైతుల నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.


Rama Rao

Rama Rao

Next Story