టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా!

టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా!
x
Highlights

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది.

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తరవాత పీసీసీ భాద్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యారు. అయన భాద్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. 2016 GHMC ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి పాలు అయింది. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోగా, హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోయింది. కాగా అటు డిసెంబర్ 09న కొత్త పీసీసీ చీఫ్ ని నియమించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories