రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఎంపీ సోయం బాపూరావు

X
Highlights
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. టీఆర్ఎస్ ఓటమిని...
Arun Chilukuri15 Dec 2020 11:38 AM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. టీఆర్ఎస్ ఓటమిని సీఎం కేసీఆర్ సహించలేక అయోమయం సృష్టిస్తున్నారని అన్నారు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో అన్న భయం కేసీఆర్ కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీసులు పోడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసగించారని విమర్శించారు.
Web TitleMP Soyam Bapu Rao Comments On KCR
Next Story