Basara IIIT: ఎంపీ సోయం బాపూరావు అరెస్ట్.. బీజేవైఎం కార్యకర్త కాలుపై నుంచి వెళ్లిన పోలీస్ వాహనం

MP Soyam Bapu Rao Arrested at Basara IIIT
x

Basara IIIT: ఎంపీ సోయం బాపూరావు అరెస్ట్.. బీజేవైఎం కార్యకర్త కాలుపై నుంచి వెళ్లిన పోలీస్ వాహనం

Highlights

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ వాహనాన్ని బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్త కాలిపై పోలీస్ వాహనం వెళ్లడంతో గాయాలయ్యాయి. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మెస్ బైకాట్ కొనసాగుతోంది. రాత్రి 3 గంటల అనంతరం మెస్‌లలో నుండి హాస్టల్‌లోకి వెళ్లి పడుకున్నారు విద్యార్థులు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి టెండర్ల ద్వారా కొత్త వారిని నియమించి ఆహారం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ బ్రేక్ ఫాస్ట్ కూడా చేయమని తేల్చి చెప్పారు విద్యార్థులు.

Show Full Article
Print Article
Next Story
More Stories