MP Revanth Reddy: నూతన సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు..

Revanth Reddy: సెక్రటేరియట్‌కు వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటి

Dhatripriya
Published on: 1 May 2023 4:32 PM IST
MP Revanth Reddy Stopped By Polices Telangana Secretariat
X

MP Revanth Reddy: నూతన సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు..

MP Revanth Reddy: సెక్రటేరియట్‌ దగ్గర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ORR టెండర్‌పై స్పెషల్‌ CS అరవింద్‌ కుమార్‌ను కలిసేందుకు వెళ్లగా.. అనుమతి లేదని గేటు దగ్గరే రేవంత్ రెడ్డిన ఆపేశారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఎంపీగా సెక్రటేరియట్ వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా పోలీసులు తనను ఆపడం అప్రజాస్వామికమన్న రేవంత్‌. రోడ్లపైనే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డులో జరిగిన అవనీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో తనను అడ్డుకుంటోందని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story