Revanth Reddy: కేసీఆర్‌, మోడీ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివాళ్లు..

నీతిఆయోగ్‌కు కేసీఆర్‌ హాజరై.. మోడీని నిలదీయాలి -రేవంత్‌

Arun Chilukuri
Published on: 6 Aug 2022 7:21 PM IST
MP Revanth Reddy Slams CM KCR Over Skips Niti Aayog Meeting
X

Revanth Reddy: కేసీఆర్‌, మోడీ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివాళ్లు..

Revanth Reddy: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని సీఎం కేసీఆర్‌ బహిష్కరించాలన్న నిర్ణయంతో మోడీ, కేసీఆర్‌ మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందని విమర్శించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. మోడీ తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలను కేసీఆర్‌ పొగిడారని, ఇప్పుడు మోడీని వ్యతిరేకిస్తున్నట్టు కేసీఆర్‌ నటిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, మోడీ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లని అన్నారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు కేసీఆర్‌ తప్పక హాజరై.. తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధాని మోడీని నిలదీయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story