టీఆర్ఎస్‌ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ పార్టీ: రేవంత్ రెడ్డి

MP Revanth Reddy Slams CM KCR ON ITIR project
x

టీఆర్ఎస్‌ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ పార్టీ: రేవంత్ రెడ్డి

Highlights

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రం ఐటీఐఆర్ కోల్పోయిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్...

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రం ఐటీఐఆర్ కోల్పోయిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. నాడు ఐటీఐఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అప్రూవల్ చేయగా ఏడేళ్లు గడిచినా, టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వలేదని తెలిపారు. ఐటీఐఆర్ కు సమానమైన ప్యాకేజీ ఇవ్వాలని కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. లాభం వచ్చేది కాదు కాబట్టే.. ఐటీఐఆర్ గురించి కేటీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని ఢిల్లీ రైతుల ఆందోళనతోనే మోడీ పతనం మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories