ఆర్మూర్ లో నేడు రేవంత్ దీక్ష

* రాజీవ్ రైతు భరోసా దీక్ష పేరుతో భారీ సభ * పసుపు బోర్డు-మద్దతు ధరపై రైతులకు భరోసా ఇవ్వనున్న రేవంత్ *రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ సభ నిర్వహణ

Sandeep Eggoju
Published on: 30 Jan 2021 7:19 AM IST
MP Revanth Reddy One Day Hunger Strike In Armoor
X

MP Revanth Reddy (file image)

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇవాళ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. పసుపు రైతుల సమస్యలపై రాజీవ్ రైతు భరోసా దీక్ష పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. పసుపు రైతుల్లో భరోసా నింపడంతోపాటు నీరుగారిన కాంగ్రెస్‌ కేడర్‌లో నూతన ఉత్తేజం నింపేందుకు రేవంత్‌రెడ్డి ఈ దీక్షకు దిగుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు-పసుపు పంటకు మద్దతు ధర ప్రధాన డిమాండ్లతో 24గంటలపాటు రేవంత్‌ ఈ దీక్ష చేయనున్నారు. ఎక్కడ్నుంచి అయితే, బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారో అక్కడే రేవంత్‌ దీక్షకు దిగుతున్నారు. ఇక, రేవంత్‌రెడ్డి తలపెట్టిన దీక్షను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story