Telangana: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Telangana: పార్లమెంట్‌లో పోరాటానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముఖం చాటేశారు -రేవంత్‌

Sandeep Eggoju
Updated on: 11 March 2021 4:01 PM IST
MP Revanth Reddy Letter To Minister KTR
X

కేటీఆర్ & రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Telangana: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పార్లమెంట్‌లో పోరాటానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముఖం చాటేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌కు ఎందుకు రావడంలేదని అన్న రేవంత్‌రెడ్డి మోడీ అంటే భయపడుతున్నారా? లేక రాజీపడుతున్నారా? అంటూ లేఖలో కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీజేపీపై గల్లీలో మీ మాటలకు, ఢిల్లీలో మీ చేతలకు పొంతనలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది కోసమే విశాఖ ఉక్కు పోరాటానికి మంత్రి కేటీఆర్‌ మద్దతు తెలిపారని ఆరోపించారు రేవంత్‌. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా..? అని లేఖలో మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు ఎంపీ రేవంత్‌రెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story