Revanth Reddy: కేంద్ర హోంమంత్రికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy: కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ కోరిన రేవంత్ రెడ్డి * కేసీఆర్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తానంటూ రేవంత్

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 8:56 PM IST
MP Revanth Reddy Letter to Central Home Minister Amit Shah
X

కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నర ఏళ్లు అవుతోందని.. అవినీతి మీద ఆధారాలతో సహా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కేంద్ర స్పందించడం లేదని లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీలకు పది మంది కాంగ్రెస్ నాయకులకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇస్తే కేసీఆర్ అవినీతిపై ఆధారాలు అందజేస్తామన్నారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ ఇలా అనేక అవకతవకలపై ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story