MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తాం..

MP R Krishnaiah: EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 4:52 PM IST
Mp R Krishnaiah Objection On EWS Reservations
X

MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తాం..

MP R Krishnaiah: EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు తెచ్చారని అన్నారు. గతంలో 9 మంది జడ్జిల ధర్మాసనం..50శాతం మించకూడదని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 11 మంది సభ్యుల ధర్మాసనం విచారణ జరపాలని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్లు అంటే పేదరిక నిర్మూలన పథకం కాదు. వెనకబడిన వర్గాలకు అధికారం ఇవ్వడం గౌరవం దక్కేలా చేసేందుకే రిజర్వేషన్లు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ లు ఇస్తే బిసిలకు ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ తగ్గుతుంది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం EWS రిజర్వేషన్లపై పునరాలోచించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story