R Krishnaiah: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి

R Krishnaiah: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి
x
Highlights

R Krishnaiah: స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

R Krishnaiah: స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌లో రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఎంపిటిసి , జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వనికి సూచించారు. లేనట్లయితే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. మోసం చేశారన్నారు. అడ్వేకేట్ జనరల్ ఓసి కావడం వల్లే ఆలస్యం అవుతుందని ఆరోపించారు. బిసిల న్యాయవాదులతో రిజర్వేషన్లకు సంబంధించిన కేసు వాదించాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories