టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఎంపీ కవిత మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్న..

Mahbubabad: మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి.

Arun Chilukuri
Published on: 7 April 2022 4:50 PM IST
MP Maloth Kavitha vs MLA Shankar Nayak
X

టీఆర్‌ఎస్‌లో భగ్గమన్న విభేదాలు.. ఎంపీ కవిత మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్న..

Mahbubabad: మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు, ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కొని మాట్లాడారు. బిత్తరబోయిన కవిత కింద కూర్చోని పక్కనే ఉన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకి జరిగిన ఘటన గురించి చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ దీక్షలో మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే పక్కనే ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వెంటనే స్పందించి జిల్లా ఆధ్యక్షరాలు కవిత ఆధ్యక్షతన చెప్పాలని మంత్రికి సూచించారు. జరుగుతున్న తతంగాన్ని చూస్తున్న నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story