కోమ‌టిరెడ్డివి మైండ్ గేమ్ రాజ‌కీయాలు : ఎంపీ బ‌డుగుల లింగ‌య్య‌

Munugodu Politics: మునుగోడులో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆపార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.

Arun Chilukuri
Updated on: 30 July 2022 7:26 PM IST
MP Lingaiah Yadav Comments on MLA Rajagopal Reddy
X

కోమ‌టిరెడ్డివి మైండ్ గేమ్ రాజ‌కీయాలు : ఎంపీ బ‌డుగుల లింగ‌య్య‌ 

Munugodu Politics: మునుగోడులో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆపార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. అయితే ఉప ఎన్నిక రావాలని తాముకోరుకోవడం లేదన్నారు. ఒక వేళ అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డివి మైండ్ గేమ్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ మండిప‌డ్డారు. ఇక నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉందన్న ఆయన ఇక మునుగోడు స్థానాన్ని కూడా టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమన్నారు.

కోమటి‎రెడ్డి రాజగోపాల్‎రెడ్డి మునుగోడు ప్రజలను అయోమాయానికి గురి చేస్తున్నారు. మునుగోడు అభివృద్ధికి ఏనాడూ రాజగోపాల్ రెడ్డి పాటుపడలేదన్నారు. అభివృద్ధి పనుల కోసం జిల్లా మంత్రి వచ్చినా ప్రొటోకాల్ పాటించలేదన్నారు. ఎక్కడో వ్యాపారాల చేసుకుంటూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story