MP Laxman: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ లక్ష్మణ్

MP Laxman: విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మణ్

Shekhar G
Published on: 30 Jan 2024 3:31 PM IST
MP Laxman visited Sri Venkateswara Temple in Tirupati
X

MP Laxman: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ లక్ష్మణ్

MP Laxman: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం పట్ల ఆదరణ పెరుగుతుందని లక్ష్మణ్ అన్నారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22 సువర్ణ అక్షరాలతో లికించబడుతుందన్నారు. 500ఏళ్ల నాటి కల రామమందిర నిర్మాణం జరిగిందని... 22న రామ మందిరాన్ని ప్రారంభించడం శుభదాయకమి చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story