MP Laxman: కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతే మా బాధ్యత కాదు

MP Laxman: ఆ పార్టీ నేతల వల్లే ప్రభుత్వం పడిపోవచ్చు

Jyothi
Published on: 12 April 2024 12:40 PM IST
MP Laxman Comments On Congress
X

MP Laxman: కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతే మా బాధ్యత కాదు

MP Laxman: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతే తమ బాధ్యత కాదని.. ఆ పార్టీ నేతల వల్లే ప్రభుత్వం పడిపోవచ్చని అన్నారు. రేవంత్‌ను తాను సమర్థిస్తే పార్టీలో కొందరికి నచ్చడం లేదన్న వీహెచ్‌ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రేవంత్‌లో ఆందోళన మొదలైందన్న లక్ష్మణ్‌... హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని తెలిపారు. అందుకే సానుభూతి వ్యాఖ్యలతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story