రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి.. రాహుల్ గాంధీకి లేఖ..
Komatireddy Venkatereddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి.. రాహుల్ గాంధీకి లేఖ..
Komatireddy Venkatereddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, మాణిక్కం ఠాగూర్‌లకు లేఖ రాశారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడం పద్ధతి కాదని లేఖలో పేర్కొన్నారు. సొంత తమ్ముడిని చంపారనే ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎర్ర శేఖర్ అన్న వెంకటరెడ్డి అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకూ కరెక్టని ప్రశ్నించారు.
Next Story




