MP KESHAVA RAO: ఇకపై ఏ అంశంలో రాజీప‌డం: కే.కేశవరావు

MP KESHAVA RAO: ఇకపై ఏ అంశంలో రాజీప‌డం: కే.కేశవరావు
x

trs mp k keshavarao sensational comments

Highlights

MP KESHAVA RAO: బీజేపీ సర్కార్‌పై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ కేంద్రానికి సహకరించామని.. ఇకపై ఏ అంశంలోనూ రాజీపడమని కే.కేశవరావు స్పష్టం చేశారు.

MP KESHAVA RAO: బీజేపీ సర్కార్‌పై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ కేంద్రానికి సహకరించామని.. ఇకపై ఏ అంశంలోనూ రాజీపడమని కే.కేశవరావు స్పష్టం చేశారు. గురువారం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని, మా ఎంపీలంతా ఆగ్రహంగా ఉన్నార‌ని అన్నారు. త‌మ స‌మస్యలపై కేంద్రానికి వంద‌ల కొద్ది లేఖ‌లు రాశామని అన్నారు. నీటి వివాదాల పరిష్కారం కోసం ఏడేళ్లుగా పోరాటం చేస్తున్నామ‌ని, పరిష్కరించే దిశగా కేంద్రం ఒక‌ అడుగు కూడా వేయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

యూరియా పంపిణీలోనూ అన్యాయం:

రైతులకు రావాల్సిన యూరియా విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం చేశార‌నీ, కేంద్రం తెస్తున్నవిద్యుత్ చట్టం తో పేద,మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంద‌ని విద్యుత్ బిల్లు ను పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని అన్నారు.

జాతీయ రహదారుల నిర్మాణంలో మోసం:

జాతీయ రహదారుల విష‌యంలోనూ కేంద్రం మ‌న రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, రాష్ట్రానికి 3155 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇస్తామని చెప్పి వెయ్యి కిలోమీటర్లు మాత్రమే ఇచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే గడ్కరి రాష్ట్రానికి వచ్చి భద్రాచలానికి జై శ్రీరామ్ రోడ్డు ఇస్తా అని ప్రజలను మభ్యపెడుతున్నార‌ని అన్నారు.

బారీ మొత్తంలో జీఎస్టీ బకాయిలు:

జీఎస్టీ రాకముందు తెలంగాణ వృద్ధి 24 శాతం, జీఎస్టీ 14 శాతం కంటే తక్కువ వస్తే రాష్ట్రాలకు నష్టపరిహారం ఇస్తామ‌ని అన్నారు. దీని ప్ర‌కారం రాష్ట్రానికి 5764 కోట్లు జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి రావాలని, అలాగే.. 2641 కోట్లు ఐ జీఎస్టీ కింద రావాలని, మొత్తంగా రూ. 8755 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి బాకాయి రావాలని పేర్కొన్నారు. ఐటీఐఅర్, టెక్ టైల్స్ పార్క్ అని చెప్పి ఆ ఊసే లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories