MP Jogi Ramesh: నీరాకేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగిరమేష్

MP Jogi Ramesh: ఏపీలోనూ నీరాకేఫ్‌లు ఏర్పాటు చేసే విధంగా.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి జోగిరమేష్

Dhatripriya
Published on: 16 May 2023 7:24 PM IST
MP Jogi Ramesh Visited Neera Cafe
X

MP Jogi Ramesh: నీరాకేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగిరమేష్

MP Jogi Ramesh: ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఏపీ మంత్రి జోగి రమేష్, హీరో సుమన్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. కొంతమంది నీరాపై దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరా ఒక ఔషధమని తెలిపారు. దేవతలు తాగిన ఔషధం నీరా అని, తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ఏపీ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. నీరాని ప్రమోట్ చేసి ఔనత్యం పెంచారని, ఏపీలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని.. సీఎం జగన్ దృష్టి కి తీసుకెళ్తామని జోగిరమేష్ పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story