నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటనలో ఉద్రిక్తత

Nizamabad: *ఎంపీ అర్వింద్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు *రోడ్డుపై బైఠాయించిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 5:01 PM IST
MP Dharmapuri Arvind visits Nizamabad district | TS Online News
X

నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటనలో ఉద్రిక్తత

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నారంలో ఎంపీ అర్వింద్ పర్యటనలో గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. గ్రామంలో పల్లెప్రకృతి వనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీ అర్వింద్ రాకముందే టీఆర్ఎస్ నేతలు కొబ్బరికాకొట్టి ప్రారంభోత్సవం చేయడంతో ఇరు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో బీజేపీ శ్రేణులు తిరగబడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డుపై పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story