Arvind Dharmapuri: ఏ ప్రభుత్వం గద్దెనెక్కిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తా

Arvind Dharmapuri: చేతులు దులుపుకుని రైతులను మోసం చేస్తుంది

Shekhar G
Published on: 22 Feb 2024 6:41 PM IST
MP Dharmapuri Arvind Fire on Congress Government
X

Arvind Dharmapuri: ఏ ప్రభుత్వం గద్దెనెక్కిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తా

Arvind Dharmapuri: అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలపై దృష్టి సారించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఏ ప్రభుత్వం గద్దెనెక్కిన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇప్పడు చేతులు దులుపుకుని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. నాడు కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడినాక నడిపిస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేశాడని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని అన్నారు. ఫ్యాక్టరీ పై గతంలో వేసిన కమిటీ ఏమైందని, మళ్లీ కమిటీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story