ఢిల్లీకి బయల్దేరిన బండి సంజయ్‌!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలువనున్నట్లు తెలుస్తోంది.

admin
Published on: 6 Dec 2020 10:39 AM IST
ఢిల్లీకి బయల్దేరిన బండి సంజయ్‌!
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలువనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను వెల్లడించనున్నారు. ఇక దీంతో పాటు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీతో సహా పలువురికి ధన్యవాదాలు తెలుపనున్నారు. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఏ పార్టీకి స్పష్టంమైన మెజార్టీ రాకపోవడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం బీజేపీ ముఖ్య నేతలు, బండి సంజయ్‌తో విజయశాంతి భేటీకానున్నారు. రేపు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు విజయశాంతి.

admin

admin

Next Story