జీహెచ్‌ఎంసీ పీఠం ఎంఐఎంకు ఇచ్చేందుకు కుట్ర : బండి సంజయ్

హైదరాబాద్‎లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి అప్పగించేందుకు టిఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

admin
Published on: 13 Nov 2020 7:36 PM IST
జీహెచ్‌ఎంసీ పీఠం ఎంఐఎంకు ఇచ్చేందుకు కుట్ర : బండి సంజయ్
X

హైదరాబాద్‎లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి అప్పగించేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 63 డీవిజన్‌లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని అన్నారు. ఈ మేరకు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందనితెలిపారు బండి సంజయ్.. ఎంఐఎంకు మేయర్‌ పదవి దక్కుండా చూస్తామని, దాదాపుగా 100 స్థానాల్లో తాము గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వరద సహాయం కింద ఇస్తున్న ఆర్థిక సాయం విషయంలోనూ పెద్ద స్కాం జరిగిందని ఆరోపించారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. దుబ్బాక ఉపఎన్నికల విషయం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందన్నారు బండి సంజయ్.

admin

admin

Next Story