MP Arvind: సీఎం కేసీఆర్, కేటీఆర్ పై ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు

MP Arvind: కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో తమతో పోరాడాలి-అర్వింద్

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 7:34 PM IST
MP Arvind Serious Comments on CM KCR and KTR
X

సీఎం కేసీఆర్ మరియు కేటీఆర్ పై మండిపడ్డ ఎంపీ అరవింద్ (ఫైల్ ఇమేజ్)

MP Arvind: సీఎం కేసీఆర్, మంత్ర్రి కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటినీ పక్కకు పెడితే లిబియాలో గడాఫీకి పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో తమతో పోరాడాలని సవాల్ చేశారు. కేబినెట్ మంత్రులు గొర్రెల మాదిరిగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ కు బానిసత్వం చేయడం కంటే చావటమే మేలన్నారు. ధాన్యం కొనుగోలుపై లైవ్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story